మెదడు సంబంధిత సమస్యలకు, జ్ఞాపకశక్తిని పెంచే సరస్వతి ఆకు..
ప్రస్తుత తరుణంలో చాలా మంది మెదడు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయి. మానసిక అనారోగ్యాలు వస్తున్నాయి. కొందరు పిల్లలకు అయితే పుట్టుకతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లలు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల చదువుల్లోనూ వెనుకబడుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ సమస్యలకు చక్కని పరిష్కారం ఉంది. అదే సరస్వతి ఆకు. ఈ ఆకును మెదడు సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. దీన్ని కొంతకాలం పాటు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి ఆకులను కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని 5 బాదంపప్పులు, 2 మిరియాలు, గోరు వెచ్చని నీరు పోసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి రసం తీయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో దానికి తేనె కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పరగడుపునే తీసుకోవాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. Memory Power ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీన్ని చిన్నారులకు సగం మోతాదులో ఇస్తే వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. మాటలు రాని పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఇస్తుంటే నెమ్మదిగా మాటలు వస్తాయి. అలాగే నత్తి కూడా తగ్గుతుంది. ఇలా సరస్వతి మొక్క ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మొక్కలు మన చుట్టు పక్కల పరిసరాల్లోనే ఉంటాయి. దీన్ని మన ఇంట్లోనూ పెంచుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు మనకు తాజా ఆకులు లభిస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుత తరుణంలో చాలా మంది మెదడు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయి. మానసిక అనారోగ్యాలు వస్తున్నాయి. కొందరు పిల్లలకు అయితే పుట్టుకతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లలు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల చదువుల్లోనూ వెనుకబడుతున్నారు. అయితే ఆయుర్వేదంలో ఈ సమస్యలకు చక్కని పరిష్కారం ఉంది. అదే సరస్వతి ఆకు. ఈ ఆకును మెదడు సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. దీన్ని కొంతకాలం పాటు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి ఆకులను కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని 5 బాదంపప్పులు, 2 మిరియాలు, గోరు వెచ్చని నీరు పోసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి రసం తీయాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో దానికి తేనె కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పరగడుపునే తీసుకోవాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
Memory Power ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. దీన్ని చిన్నారులకు సగం మోతాదులో ఇస్తే వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. మాటలు రాని పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఇస్తుంటే నెమ్మదిగా మాటలు వస్తాయి. అలాగే నత్తి కూడా తగ్గుతుంది. ఇలా సరస్వతి మొక్క ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మొక్కలు మన చుట్టు పక్కల పరిసరాల్లోనే ఉంటాయి. దీన్ని మన ఇంట్లోనూ పెంచుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు మనకు తాజా ఆకులు లభిస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవచ్చు.