కీళ్ల నొప్పులు రావడం అనేది షుగర్ వ్యాధి లక్షణం
కీళ్ల నొప్పులు రావడం అనేది షుగర్ వ్యాధి లక్షణం
కీళ్ల నొప్పులు రావడం అనేది షుగర్ వ్యాధి లక్షణం, చాలామందిలో ఏదైనా వ్యాధి సంభవించేటప్పుడు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ సంకేతాలు తెలుసుకోకుండా ఉంటే మాత్రం ప్రాణాలకి ప్రమాదం వచ్చి పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని వ్యాధుల బారిన పడవలసి వస్తూ ఉంటుంది. కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు ముందుగా అప్రమత్తం అయ్యి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయపడుతున్న వ్యాధి షుగర్ ఈ షుగర్ అనేది వయసు తరహా లేకుండా అందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా జీవితంలో కొన్ని మార్పులే ఈ షుగర్ వ్యాధికి మూలం అవుతుంది. ఏదైనా వ్యాధి వచ్చే ముందు శరీరంలో ముందుగా కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. చాలామంది మనకి మధుమేహం ఏంటి ఏమి ఉండదులే అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఆలస్యం చేసి కొద్ది మధుమేహం పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం అవుతూ ఉంటుంది. మన శరీరంలో కొన్ని లక్షణాలు కనబడితే అది మధుమేహం వ్యాధికి సంబంధించిన లక్షణాలు అవ్వచ్చని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ కింద చూపించిన ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే మధుమేహం టెస్ట్ చేయించుకోవాలి . బరువు తగ్గడం : కొంతమంది బరువు తగ్గడం మంచిది. అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కో సమయంలో బరువు తగ్గడం కూడా షుగర్ వ్యాధి లక్షణం అవచ్చు. కొందరిలో ఈ లక్షణం కనిపించినప్పటికీ చాలా ఎక్కువమందిలో ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడం కోసం ప్రత్యేకంగా ఎటువంటి డైట్ తీసుకోకపోయినప్పటికీ బరువు తగ్గితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. Health Problems If you see these signs, be alert immediately ఎక్కువ సమయం పడుకున్న అలసటగా ఉంటే : రాత్రి సమయంలో ఎక్కువ సమయం పడుకున్నా కూడా ఉదయం లేచిన తర్వాత అలసటగా ఉంటే అది కూడా షుగర్ వ్యాధి లక్షణం. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పటికీ అలసటగా ఉంటుంది. దానికి అలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు : స్పష్టమైన కారణం లేకుండా కండరాలు లేదా కీళ్ల నొప్పులు రావడం అనేది షుగర్ వ్యాధి లక్షణం అవచ్చు. ఈ కీళ్లనొప్పులు కండరాల నొప్పులు రావడానికి కారణాలు అవ్వకపోయినా తక్షణమే వైద్యున్ని సంప్రదించడం మంచిది. గాయం వెంటనే తగ్గకపోతే : మీ శరీరంలో ఏదైనా ప్రదేశంలో గాయమైతే తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటే అది కూడా మధుమేహం వ్యాధి లక్షణమే అవ్వచ్చు. ఈ షుగర్ ఉన్నవాళ్లకి గాయాలు తొందరగా నిర్ణయం అవ్వవు ఇటువంటి సమస్యను ఎవరైనా ఎదుర్కోవాల్సి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.