హమ్మయ్య దోపిడి దొంగ దొరికాడు

 హమ్మయ్య దోపిడి దొంగ దొరికాడు ఎట్టకేలకు దోపిడి దొంగను  పట్టుకున్న పోలీసులు.- ఇల్లందు వాసులను బెంబేలెత్తించిన దోపిడి దొంగ- ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన భస్తి జనం- రాత్రుళ్ళు కాలనీలలో  యువకులే రక్షణగా పహారా కాసిన వైనం...మన్యం న్యూస్, ఇల్లందు , నవంబర్ 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2015 వ,సంవత్సరం నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గుగులోతు రంజిత్ అనే వ్యక్తిని ఇల్లందు సీఐ బి రాజు సిబ్బందితో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద నిగా పెట్టి పట్టుకున్నారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 2015 సంవత్సరంలో ఇల్లందు పట్టణంలో మూడు దొంగతనాలు,2017 సంవత్సరంలో ఒక్క దొంగతనం,2020 సంవత్సరంలో మూడు దొంగతనాలు,2021 వ సంవత్సరంలో మూడు దొంగతనాలు,2020 సంవత్సరంలో ఒక హత్య నాలుగు దొంగతనాలు మొత్తం 15 నేరాలతో నిందితుడుపై ఉన్నాయని,ఈ నేరాలతో 06 గ్రేవ్,09 నాన్ గ్రేవ్ నేరాలు ఇతడిపై ఉన్నాయని తెలిపారు. అలాగే వరుస దొంగతనాలు చేస్తూ రాత్రిపూట ఇండ్ల తలుపులకు డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించి కొట్టి చంపుతానని బెదిరిస్తూ మహిళ మెడలో ఉన్న ఆభరణాలు ఇంట్లో ఉన్న బంగారం వెండి డబ్బులు దోచుకునేవాడని, అదేవిధంగా దేవాలయాలలో తాళాలు పగలగొట్టి దేవతల విగ్రహాలు, హుండీలోని డబ్బులు దొంగలించేవాడని తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి నుండి 310 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి,95000 వేల రూపాయల నగదు,ఇత్తడి వస్తువులు మరియు దేవాలయంలో దొంగతనం చేసిన సువర్చల దేవి పంచలోహము విగ్రహం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి మొత్తం విలువ రూ. 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. పట్టుకున్న వ్యక్తిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగిందని సిఐ రాజు తెలిపారు. 

హమ్మయ్య దోపిడి దొంగ దొరికాడు

 


హమ్మయ్య దోపిడి దొంగ దొరికాడు

 ఎట్టకేలకు దోపిడి దొంగను  పట్టుకున్న పోలీసులు.

- ఇల్లందు వాసులను బెంబేలెత్తించిన దోపిడి దొంగ

- ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన భస్తి జనం

- రాత్రుళ్ళు కాలనీలలో  యువకులే రక్షణగా పహారా కాసిన వైనం...


మన్యం న్యూస్, ఇల్లందు , నవంబర్ 21 పోలీస్ స్టేషన్ పరిధిలోని 2015 వ,సంవత్సరం నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గుగులోతు రంజిత్ అనే వ్యక్తిని ఇల్లందు సీఐ బి రాజు సిబ్బందితో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద నిగా పెట్టి పట్టుకున్నారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 2015 సంవత్సరంలో ఇల్లందు పట్టణంలో మూడు దొంగతనాలు,2017 సంవత్సరంలో ఒక్క దొంగతనం,2020 సంవత్సరంలో మూడు దొంగతనాలు,2021 వ సంవత్సరంలో మూడు దొంగతనాలు,2020 సంవత్సరంలో ఒక హత్య నాలుగు దొంగతనాలు మొత్తం 15 నేరాలతో నిందితుడుపై ఉన్నాయని,ఈ నేరాలతో 06 గ్రేవ్,09 నాన్ గ్రేవ్ నేరాలు ఇతడిపై ఉన్నాయని తెలిపారు. అలాగే వరుస దొంగతనాలు చేస్తూ రాత్రిపూట ఇండ్ల తలుపులకు డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించి కొట్టి చంపుతానని బెదిరిస్తూ మహిళ మెడలో ఉన్న ఆభరణాలు ఇంట్లో ఉన్న బంగారం వెండి డబ్బులు దోచుకునేవాడని, అదేవిధంగా దేవాలయాలలో తాళాలు పగలగొట్టి దేవతల విగ్రహాలు, హుండీలోని డబ్బులు దొంగలించేవాడని తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి నుండి 310 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి,95000 వేల రూపాయల నగదు,ఇత్తడి వస్తువులు మరియు దేవాలయంలో దొంగతనం చేసిన సువర్చల దేవి పంచలోహము విగ్రహం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి మొత్తం విలువ రూ. 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. పట్టుకున్న వ్యక్తిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగిందని సిఐ రాజు తెలిపారు.