భారతీయుల కోసం సౌదీ మార్పులు

 డబ్బు ఉన్నంత మాత్రాన… దేశమంతా అపార చమురు నిల్వలు ఉన్నంత మాత్రాన… పనులు మొత్తం జరిగిపోవు.    పనిచేసే వారు ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. ఈ చిన్న లాజిక్ సౌదీ అరేబియా మిస్ అయింది. ఆ మధ్య నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను గట్టిగా పట్టుకుంది. ఠాట్..అంటూ నిరసన వ్యక్తం చేసింది. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనకు ముందు నిరసన వ్యక్తం చేసింది. దీనిపై దేశంలో ప్రతిపక్షాలు గగ్గోలుమన్నాయి. నరేంద్ర మోడీ పై విమర్శలు చేశాయి. దీంతో నరేంద్ర మోడీ ఆదేశించడంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రంగంలోకి దిగారు. తర్వాత సీన్ మారింది. దెబ్బకు సౌదీ అరేబియా నేలకు దిగి వచ్చింది.      సౌదీ అరేబియా ఎడారి దేశం. చమురు నిలువలు విస్తారంగా కలిగి ఉన్న దేశం. సుఖం ఎక్కువైతే ముఖం కడగటానికి తీరిక ఉండదు అన్నట్టు.. అపారమైన సంపదకు నిలయమైన సౌదీ దేశంలో పని చేసే స్థానికులు తక్కువ. పైగా ఆదేశంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మితమవుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే మానవ వనరులు చాలా చాలా ముఖ్యం. దేశంలో కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సౌదీ వెళ్తూ ఉంటారు.. నూపూర్ శర్మ వ్యాఖ్యల తర్వాత సౌదీ కొన్ని నిబంధనలను విధించింది. దీనివల్ల ఆ దేశానికి వెళ్లే వారి ఉపాధి పై దెబ్బ పడింది. భారత్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన రావడంతో సౌదీ కి షాక్ తగిలినంత పనైంది. దీంతో మానవ వనరులు లేక కీలకమైన ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా రియాద్ మెట్రో, కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో సౌదీ అరేబియాకు సినిమా అర్థమైంది. దెబ్బకు తన విధానాన్ని మార్చుకుంది.         సౌదీ అరేబియాలో ఉపాధి కోసం భారత దేశ పౌరులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. బ్లూ కాలర్ మొదలు వివిధ కేటగిరీల వీధుల్లో భారతీయులు పెద్ద ఎత్తున చేస్తారు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే నిత్యం వెయ్యి వీసాలు ఎండార్స్ అవుతూ ఉంటాయి.. ఈ వీ సాల ఎండార్స్ కు ముందు పీసీసీ( పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్) తప్పనిసరి అంటూ సౌదీ ప్రభుత్వం ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చింది.. అయితే ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలంటే భారత్ కోరుతూ వస్తోంది.. అయితే ఇటీవల సౌదీ పర్యటనకు వచ్చిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఆ దేశ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.. ఆ నిబంధన నుంచి భారతదేశాన్ని మినహాయిస్తూ సౌదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉపాధి నిమిత్తం ఆ దేశానికి వెళ్లే భారతీయులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

భారతీయుల కోసం సౌదీ మార్పులు


 డబ్బు ఉన్నంత మాత్రాన… దేశమంతా అపార చమురు నిల్వలు ఉన్నంత మాత్రాన… పనులు మొత్తం జరిగిపోవు.    పనిచేసే వారు ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. ఈ చిన్న లాజిక్ సౌదీ అరేబియా మిస్ అయింది. ఆ మధ్య నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను గట్టిగా పట్టుకుంది. ఠాట్..అంటూ నిరసన వ్యక్తం చేసింది. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటనకు ముందు నిరసన వ్యక్తం చేసింది. దీనిపై దేశంలో ప్రతిపక్షాలు గగ్గోలుమన్నాయి. నరేంద్ర మోడీ పై విమర్శలు చేశాయి. దీంతో నరేంద్ర మోడీ ఆదేశించడంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రంగంలోకి దిగారు. తర్వాత సీన్ మారింది. దెబ్బకు సౌదీ అరేబియా నేలకు దిగి వచ్చింది.      సౌదీ అరేబియా ఎడారి దేశం. చమురు నిలువలు విస్తారంగా కలిగి ఉన్న దేశం. సుఖం ఎక్కువైతే ముఖం కడగటానికి తీరిక ఉండదు అన్నట్టు.. అపారమైన సంపదకు నిలయమైన సౌదీ దేశంలో పని చేసే స్థానికులు తక్కువ. పైగా ఆదేశంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మితమవుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే మానవ వనరులు చాలా చాలా ముఖ్యం. దేశంలో కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సౌదీ వెళ్తూ ఉంటారు.. నూపూర్ శర్మ వ్యాఖ్యల తర్వాత సౌదీ కొన్ని నిబంధనలను విధించింది. దీనివల్ల ఆ దేశానికి వెళ్లే వారి ఉపాధి పై దెబ్బ పడింది. భారత్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన రావడంతో సౌదీ కి షాక్ తగిలినంత పనైంది. 

దీంతో మానవ వనరులు లేక కీలకమైన ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా రియాద్ మెట్రో, కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో సౌదీ అరేబియాకు సినిమా అర్థమైంది. దెబ్బకు తన విధానాన్ని మార్చుకుంది.         సౌదీ అరేబియాలో ఉపాధి కోసం భారత దేశ పౌరులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. బ్లూ కాలర్ మొదలు వివిధ కేటగిరీల వీధుల్లో భారతీయులు పెద్ద ఎత్తున చేస్తారు. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే నిత్యం వెయ్యి వీసాలు ఎండార్స్ అవుతూ ఉంటాయి.. ఈ వీ సాల ఎండార్స్ కు ముందు పీసీసీ( పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్) తప్పనిసరి అంటూ సౌదీ ప్రభుత్వం ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చింది.. అయితే ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలంటే భారత్ కోరుతూ వస్తోంది.. అయితే ఇటీవల సౌదీ పర్యటనకు వచ్చిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఆ దేశ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.. ఆ నిబంధన నుంచి భారతదేశాన్ని మినహాయిస్తూ సౌదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉపాధి నిమిత్తం ఆ దేశానికి వెళ్లే భారతీయులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.